రౌడీషీటర్ సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసులో ఏడుగురు నిందితులుగా సిట్ ఛార్జిషీట్
రిపోర్టర్: రమేష్
స్థలం: విజయవాడ
విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో రౌడీషీటర్ సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం కోర్టులో అభియోగపత్రం దాఖలు చేసింది. అప్పటి సీఐ నాగరాజు సహా ఏడుగురిని నిందితులుగా, 120 మందిని సాక్షులుగా సిట్ అధికారులు నమోదు చేశారు. మార్కాపురం నుంచి అదుపులోకి తీసుకున్న సాయికృష్ణను కోర్టులో హాజరుపరచకుండా స్టేషన్లో తీవ్రంగా కొట్టడం వల్లే ఆరోగ్యం క్షీణించి మరణించాడని, అనంతరం శవాన్ని అర్ధరాత్రి దహనం చేసి సాక్ష్యాలను తారుమారు చేశారని ఛార్జిషీట్లో స్పష్టం చేశారు.