నవ్వులు పంచేందుకు వస్తున్న మౌళి తనూజ్ క్రైమ్ కామెడీ చిత్రం

రిపోర్టర్: రాము స్థలం: హైదరాబాద్

యువ హీరో మౌళి తనూజ్ ప్రశాంత్ నటిస్తున్న తాజా క్రైమ్ కామెడీ చిత్రం దొంగ నా కొడుకు నవంబర్ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది అని చిత్ర యూనిట్ వెల్లడించింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై శ్రీను కంబాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. బుధవారం విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై అంచనాలను పెంచుతోంది అని దర్శకుడు తెలిపారు.