భక్తిశ్రద్ధలతో ప్రశాంతంగా గణనాథుని వేడుకలు నిర్వహించాలని పోలీసుల పిలుపు
రిపోర్టర్: k. siva prasad
స్థలం: చిట్వేల్
చిట్వేల్ మండలంలో వినాయక చవితి వేడుకలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించుకోవాలని స్థానిక ఎస్సై ఎస్.వినోద్‌కుమార్ సూచించారు. పండుగ వేళ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు శాఖ ఆధ్వర్యంలో పటిష్టమైన ముందస్తు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. ఉత్సవాల్లో డీజేల వినియోగానికి ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని, ధ్వని పరిమితులు పాటించాలని స్పష్టం చేశారు. విగ్రహాల ఏర్పాటు, నిమజ్జన ఊరేగింపుల్లో ప్రజల రాకపోకలకు ఆటంకం కలిగించరాదని నిర్వాహకులను హెచ్చరించారు. భక్తిశ్రద్ధలు, మత సామరస్యంతో పండుగను ఆనందంగా జరుపుకోవాలని, అనుమానాస్పద సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని కోరారు.