రష్యాలో భారీ మంచు చరియలు విరిగిపడి 11 మంది మృతి

రిపోర్టర్: విజయ్ స్థలం: World

రష్యాలోని కబర్డినో-బల్కారియా ప్రాంతంలో మౌంట్ మిజిర్గి శిఖరంపై భారీ మంచు చరియలు విరిగిపడిన ప్రమాదంలో 11 మంది పర్వతారోహకులు దుర్మరణం చెందారు. ఈ ఘటనలో మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. 33 మందితో వెళ్లిన బృందంలో మిగతా వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా రెస్క్యూ ఆపరేషన్‌కు తీవ్ర అంతరాయం కలుగుతోంది.