2029లోపు మరో మూడు డీఎస్సీలు నిర్వహిస్తాం: మంత్రి నారా లోకేశ్
రిపోర్టర్: హరి
స్థలం: విజయవాడ
విజయవాడలో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో మంత్రి నారా లోకేశ్ కీలక ప్రకటన చేశారు. 2029లోపు మరో మూడు డీఎస్సీలు నిర్వహిస్తామని స్పష్టం చేశారు. 'కాయలున్న చెట్టుకే రాళ్లదెబ్బలు' అంటూ విమర్శలను తిప్పికొట్టారు. ఏపీ విద్యా వ్యవస్థను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దుతామని, ప్రభుత్వ బడుల్లో 'నో అడ్మిషన్' బోర్డులు కనిపించేలా విద్యా ప్రమాణాలు పెంచుతామని ఆయన పేర్కొన్నారు. గత ప్రభుత్వం తెచ్చిన 117 జీవోతో విద్యార్థులు నష్టపోయారని లోకేశ్ ఆరోపించారు.