పెరిగిన ధరలతో శుభకార్యాల్లో సిల్వర్ కోటెడ్ వస్తువులకే విపరీతమైన డిమాండ్

రిపోర్టర్: రమేష్ స్థలం: తెలంగాణ

బంగారం మరియు వెండి ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో ప్రస్తుతం శుభకార్యాల్లో సిల్వర్ కోటెడ్ వస్తువుల హవా నడుస్తోందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. తక్కువ ధరకే లభించడం మరియు ఆకర్షణీయంగా ఉండటంతో మహిళలు కుంకుమ భరిణెలు, డిన్నర్ సెట్లు, రాధాకృష్ణ ఫోటో ఫ్రేములు, పూల సజ్జల కొనుగోళ్లపై అధిక ఆసక్తి చూపుతున్నారు. రూ.50 ల నుంచి రూ.600 లోపు ధరలలో ఇవి అందుబాటులో ఉండటంతో బహుమతులుగా ఇచ్చేందుకు ప్రజలు వీటిని ఎక్కువగా ఎంచుకుంటున్నట్లు వ్యాపారులు తెలిపారు.