మోడీ చిన్ననాటి స్నేహితుడికి భూ వివాదంలో ఊరట
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: మహారాష్ట్ర
ప్రధాని మోడీని కలిసిన ఆయన చిన్ననాటి స్నేహితుడు అస్గర్ అలీ వోరా భూవివాదంలో ఊరట లభించింది. భయందర్‌లో తన భూమిని కబ్జా చేశారంటూ బీజేపీ ఎమ్మెల్యే నరేంద్ర మెహతాపై వోరా ప్రధానికి ఫిర్యాదు చేశారు. ప్రధాని జోక్యంతో స్పందించిన ఎమ్మెల్యే మెహతా, వివాదాస్పద భూమిని వదులుకుంటున్నట్లు ప్రకటించడంతో పాటు నిర్మాణ అనుమతులను కూడా రద్దు చేసుకున్నారు.