హాలీవుడ్ సంచలనం: ప్రముఖ సినిమాలో కీలక పాత్రను తిరస్కరించిన నటి అమండా

రిపోర్టర్: శివ స్థలం: Los Angeles

ప్రముఖ హాలీవుడ్ నటి అమండా సైఫ్రైడ్ గార్డియన్స్ ఆఫ్ ది గెలాక్సీ చిత్రంలో గమోరా పాత్రను తిరస్కరించినట్లు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ నిర్ణయంపై తనకు ఎలాంటి విచారం లేదని, ఆ సమయంలో చెట్టు, రకూన్ మాట్లాడుకోవడం తనకు నచ్చలేదని ఆమె స్పష్టం చేశారు. ఆ చిత్రం విజయం సాధిస్తుందని తాను భావించలేదని, అయితే తాను తీసుకున్న నిర్ణయం పట్ల ఎలాంటి పశ్చాత్తాపం లేదని అమండా పేర్కొన్నారు.