నెల్లూరు మేయర్ పీఠంపై ఉత్కంఠ: సర్వే నిర్వహించిన తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం
రిపోర్టర్: సురేష్
స్థలం: నెల్లూరు
నెల్లూరు మేయర్ స్థానం జనరల్ కేటగిరీకి కేటాయించడంతో కూటమి పార్టీలలో పోటీ తీవ్రమైంది. మేయర్ పదవిని ఎవరికి కేటాయించాలనే అంశంపై తెలుగుదేశం పార్టీ అధిష్ఠానం ఐవీఆర్ఎస్ ద్వారా రహస్య సర్వే నిర్వహించిందని స్థానిక నాయకులు తెలిపారు. పొత్తులో భాగంగా ఈ స్థానాన్ని దక్కించుకునేందుకు జనసేన, భాజపా కూడా తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. సర్వే ఫలితాలు మరియు అభ్యర్థుల ఎంపికపై రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు.