టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న టీమిండియా

రిపోర్టర్: వెంకట్ స్థలం: ఢిల్లీ

ఢిల్లీ వేదికగా భారత్, అఫ్గానిస్థాన్ జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచిన భారత కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దీంతో అఫ్గానిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేయనుంది. గాయంతో వరుణ్ చక్రవర్తి దూరమవ్వగా, అతడి స్థానంలో రవి బిష్ణోయ్ తుది జట్టులోకి వచ్చాడు. అఫ్గానిస్థాన్ జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదని ఆ జట్టు కెప్టెన్ ఇబ్రహీం జద్రాన్ వెల్లడించారు.