హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం: లారీ క్యాబిన్ లో డ్రైవర్ మృతి
రిపోర్టర్: గోపి
స్థలం: సూర్యాపేట
సూర్యాపేట రూరల్ మండల పరిధిలోని జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఒక డీసీఎం డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. విజయవాడ వైపు వెళ్తున్న రెండు డీసీఎం వాహనాలు టేకుమట్ల సమీపంలో అతివేగంగా ఒకదానినొకటి ఢీకొనడంతో ఈ ప్రాణనష్టం సంభవించింది. ప్రమాద తీవ్రతకు లారీ క్యాబిన్ లోనే డ్రైవర్ ఇరుక్కుపోయి తీవ్ర గాయాలతో మృతి చెందారని స్థానికులు పేర్కొన్నారు.