టెర్రరిజానికి కొత్త కేంద్రంగా ఆఫ్రికా మారినట్లు అమెరికా నివేదిక వెల్లడి
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: World
ప్రపంచంలో టెర్రరిజం కేంద్రం ఆఫ్రికాకు మారినట్లు అమెరికా హౌస్ కమిటీ ఆన్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ నివేదిక వెల్లడించింది. ఐసిస్ కార్యకలాపాలలో మూడింట రెండవ వంతు ఆఫ్రికాలోనే జరుగుతున్నాయని తెలిపింది. ఉగ్రవాద మరణాలు ఎక్కువగా ఉన్న పది దేశాలలో ఏడు ఆఫ్రికాలోనే ఉన్నాయని, ఇంటెలిజెన్స్ లోపాలు తీవ్ర సవాళ్లు విసురుతున్నాయని అమెరికా హెచ్చరించింది.