మహారాజపురం తపస్సు ఫలితంగా నూతన విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయపురం
నగరి నియోజకవర్గం విజయపురం మండలం మహారాజపురం వద్ద నూతన విద్యుత్ సబ్ స్టేషన్ మంజూరైంది. నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ప్రత్యేక చొరవతో ఈ ప్రాజెక్టును సాధించారు. మహారాజపురం సబ్ స్టేషన్ నిర్మాణానికి సుమారు నాలుగు కోట్ల ఇరవై మూడు లక్షల రూపాయలను కేటాయించారు. ఈ నిర్మాణ పనులను తక్షణమే ప్రారంభించి, వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రజలకు నిరంతరం విద్యుత్ సౌకర్యం అందుబాటులోకి తేవాలని అధికారులను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ గట్టిగా ఆదేశించారు.