అయనంబాకం ప్రజల చిరకాల స్వప్నం సాకారానికి సబ్ స్టేషన్ కేటాయింపు
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: విజయపురం
నగరి మండలం అయినంబాకం ప్రాంతంలో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారంగా నూతన సబ్ స్టేషన్ మంజూరైంది. స్థానిక ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ చేసిన ప్రత్యేక కృషితో ఈ కీలక ప్రాజెక్టు సాకారమవుతోంది. ఈ 33/11 కేవీ అయినంబాకం సబ్ స్టేషన్ నిర్మాణ పనుల నిమిత్తం సుమారు మూడు కోట్ల యాభై ఐదు లక్షలకు పైగా నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే పనులను పూర్తి చేసి స్థానిక ప్రజలకు నిరంతరం నాణ్యమైన విద్యుత్ అందించాలని అధికారులను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ ఆదేశించారు.