రాహుల్‌గాంధీ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డ బీజేపీ నేత సుధాన్షు త్రివేది

రిపోర్టర్: వెంకట్ స్థలం: న్యూఢిల్లీ

స‌ర్ ప్రక్రియ‌ను విమర్శిస్తూ రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ సుధాన్షు త్రివేది తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాహుల్‌కు రాజకీయాలపై అవగాహన లేదని, కాంగ్రెస్ పతనానికి సోనియా, రాహులే కారణమని ఆరోపించారు. సర్ ప్రక్రియను నిర్వహించే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని స్పష్టం చేశారు. నిజాలు తెలియకుండా రాహుల్ ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. వయనాడ్‌లో ముస్లిం లీగ్ మద్దతుతోనే ఆ ఇద్దరూ గెలిచారని సుధాన్షు త్రివేది ఎద్దేవా చేశారు.