2029 ఎన్నికలే లక్ష్యంగా జనసేన రాజకీయ వ్యూహాలు

రిపోర్టర్: హరి స్థలం: ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2029 ఎన్నికల నాటికి సీఎం రేసుపై ఉత్కంఠ నెలకొంది. గత ఎన్నికల్లో కూటమి విజయానికి కీలకపాత్ర పోషించిన జనసేనాని పవన్ కళ్యాణ్, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ సొంత బలాన్ని నిరూపించుకోవాలని భావిస్తున్నారు. క్షేత్రస్థాయిలో జనసేన ఓటు బ్యాంకును చాటడమే లక్ష్యంగా కేడర్ ఆత్మగౌరవాన్ని కాపాడుతూ పోటీ చేస్తామని ఆయన స్పష్టం చేశారు.