నిజామాబాద్‌లో గర్భిణీ యూట్యూబర్ భర్త హరిబాబు హత్య

రిపోర్టర్: సునీల్ స్థలం: నిజామాబాద్

నిజామాబాద్‌లోని రాజరాజేంద్ర చౌరస్తా వద్ద గర్భిణీ యూట్యూబర్ వైష్ణవి హత్య కేసులో నిందితుడిగా ఉన్న చిఠారి హరిబాబును దుండగులు కత్తితో నరికి హత్య చేశారు. బైల్‌పై బయటకు వచ్చిన హరిబాబును కారులో వచ్చిన ముగ్గురు, నలుగురు వ్యక్తులు వెంబడించి మెడపై, తలపై దాడి చేయడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. గతంలో భార్య వైష్ణవిని హత్య చేసిన కేసులో అరెస్టై జైలుకు వెళ్లిన హరిబాబు ఇటీవల బెయిల్‌పై బయటకు వచ్చాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన నిజామాబాద్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.