ఖమ్మంలో ముగింపు దశకు చేరిన డిజిటల్ పంట సర్వే
రిపోర్టర్: Alfa News Desk
స్థలం: కుసుమంచి
ఖమ్మం జిల్లాలో డిజిటల్ పంటల సర్వే తుది దశకు చేరుకుంది. ఇప్పటివరకు ఇరవై ఒకట్రై మండలాల పరిధిలోని మూడు వందల ఎనభై ఎనిమిది గ్రామాల్లో ఏడు లక్షల అరవై వేలకు పైగా ప్లాట్లలో ఆరు లక్షల తొంభై ఐదు వేలకు పైగా సర్వే పూర్తయినట్లు జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య వెల్లడించారు. వివరాలు నమోదు కాకపోతే మద్దతు ధరలో రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉందని ఆయన స్పష్టం చేశారు.