విజయవాడ బైపాస్లో ఘోర రోడ్డు ప్రమాదం: కారు దగ్దమై నలుగురు మృతి

రిపోర్టర్: కృష్ణ స్థలం: విజయవాడ

విజయవాడ బైపాస్ రోడ్డుపై సోమవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు సహా నలుగురు దుర్మరణం చెందారని పోలీసులు తెలిపారు. నున్నకు చెందిన కొమ్మారెడ్డి రామ్దేవ్ కుటుంబ సభ్యులతో కలిసి ఈవీ కారులో వస్తుండగా మలుపు వద్ద అదుపుతప్పిన వాహనం డివైడర్ను ఢీకొట్టింది. ఒక్కసారిగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్దమైంది. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.