తెలంగాణలో బీజేపీ సైలెంట్ కాలేదు: రెండు పార్టీలపై ఎంపి అర్వింద్ సంచలన విమర్శలు
రిపోర్టర్: కృష్ణ
స్థలం: నిజామాబాద్
తెలంగాణలో బీజేపీ సైలెంట్ కాలేదని, రాబోయే ఎన్నికల్లో కాషాయ సునామీ ఖాయమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్పష్టం చేశారు. గురువారం నిజామాబాద్లో మీడియాతో మాట్లాడుతూ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు పరస్పరం కాపాడుకుంటున్నాయని తీవ్రంగా దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఔట్ చేసేందుకు ఆ పార్టీల మధ్య రహస్య పొత్తు చర్చలు జరుగుతున్నాయని ఆరోపించారు. కేటీఆర్ గడ్డం పెంచడంపై కూడా ఆయన ఎద్దేవా చేశారు.