'ప్రధాని మోదీ జన్మదినం': పురందేశ్వరి ప్రత్యేక శుభాకాంక్షలు
రిపోర్టర్: మహేష్
స్థలం: Andhra Pradesh
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జన్మదినం సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి ఆయనకు హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. దేశంలోని ప్రతి వర్గం ప్రజల సంక్షేమమే లక్ష్యంగా మోదీ పాలన సాగుతోందని పేర్కొన్నారు. పేదలు, మహిళలు, యువత, రైతులు మరియు చిరు వ్యాపారుల అభ్యున్నతి కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వారి జీవితాల్లో మోదీ భరోసా నింపుతున్నారని పురందేశ్వరి కొనియాడారు. సమాజంలోని అన్ని వర్గాల అభివృద్ధికి ఆయన చేస్తున్న కృషి ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు.