చంద్రబాబు అరెస్ట్ కక్షసాధింపు రాజకీయమే: మంత్రి నారా లోకేశ్
రిపోర్టర్: హరి
స్థలం: అమరావతి
మూడేళ్ల క్రితం రాజకీయ కక్షసాధింపుతోనే తెదేపా అధినేత చంద్రబాబును అక్రమ కేసులో అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెట్టారని మంత్రి నారా లోకేశ్ ధ్వజమెత్తారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వేధించినా ప్రపంచవ్యాప్తంగా తెలుగుజాతి నిజం గెలవాలి అంటూ అండగా నిలిచిందని గుర్తుచేశారు. అబద్ధాలతో నిజాన్ని ఎన్నాళ్లూ బంధించలేరని, కుట్రలు ఓడిపోయి నిజమే గెలిచిందని స్పష్టం చేశారు.