దివంగత నటుడు వికాస్ సేథ్ భార్య కీలక నిర్ణయం

రిపోర్టర్: విజయ్ స్థలం: మహారాష్ట్ర

దివంగత నటుడు వికాస్ సేథ్ అకస్మిక మరణం తర్వాత ఆయన భార్య జాన్వి సేథ్ ఒంటరిగానే ఇద్దరు కవల కుమారులను పెంచుకుంటూ ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. భర్త జ్ఞాపకాలను గుండెల్లో దాచుకుంటూనే, పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతున్నానని తెలిపారు. కఠిన పరిస్థితుల్లోనే అసలైన ధైర్యం బయటపడుతుందని, ఇద్దరు పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడమే తన ప్రధాన లక్ష్యమని ఆమె స్పష్టం చేశారు.