ఓ నా సిద్ధయ్య సాంగ్ లాంచ్: హాజరైన సోనూసూద్
రిపోర్టర్: కిరణ్
స్థలం: Hyderabad
హైదరాబాద్ లోని శంషాబాద్ లో సిద్ధు రెడ్డి కందకట్ల, కాత్యాయనీ జగన జంటగా నటించిన ఓ నా సిద్ధయ్య ప్రైవేట్ ఆల్బమ్ సాంగ్ లాంచ్ ఈవెంట్ ఘనంగా జరిగిందని నటుడు సోనూసూద్ తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ, 70ఎంఎం భారీ స్క్రీన్ పై పాటను విడుదల చేయడం వినూత్న ప్రయత్నమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సినీ, రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు.