అగ్ని ప్రమాద బాధితుడి గోవిందా కి జనసేన నేతల రఘు, నర్సింగరావు లు ఆర్థిక సాయం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: విజయనగరం

గణపతి నవరాత్రుల సమయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు గోవిందు కుటుంబానికి జనసేన నేతలు కోట్ల రఘు, చెల్లుబోయిన నర్సింహారావు అండగా నిలిచారు. వారి ఆర్థిక ఇబ్బందులను గమనించి, కోట్ల రఘు యాభై వేల రూపాయలు, నర్సింహారావు లక్ష రూపాయల చొప్పున మొత్తం లక్షన్నర రూపాయలను నేరుగా అందజేసి మానవత్వాన్ని చాటుకున్నారు.