ఐఐఎం అహ్మదాబాద్ గోల్డ్ మెడల్ సాధించిన శుభమ్ గోయల్ విజయగాథ

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

ఐఐఎం అహ్మదాబాద్లో గోల్డ్ మెడల్ సాధించిన శుభమ్ గోయల్ తన విజయ ప్రయాణం గురించి వెల్లడించారు. ఢిల్లీ టెక్నలాజికల్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ పూర్తి చేసిన ఆయన, ఐఐఎం అహ్మదాబాద్లో మొదటి స్థానంలో నిలిచి బంగారు పతకం అందుకున్నారు. ఎలాంటి అంచనాలు లేకుండా కేవలం కష్టపడి చదవడంపైనే దృష్టి పెట్టానని, ప్రస్తుతం కెనడాలో మైక్రోసాఫ్ట్ సంస్థలో ప్రిన్సిపాల్ ప్రొడక్ట్ మేనేజర్గా విధులు నిర్వర్తిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.