ఐపీఎల్ ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ పై సురేష్ రైనా తీవ్ర అసహనం

రిపోర్టర్: గోపి స్థలం: India

ఐపీఎల్ లోని 'ఇంపాక్ట్ ప్లేయర్' నిబంధనపై మాజీ క్రికెటర్ సురేష్ రైనా తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేశారు. ఈ రూల్ వల్ల బౌలర్లకు అన్యాయం జరుగుతోందని, ఆటలో సమతుల్యత దెబ్బతింటోందని ఆయన మండిపడ్డారు. 170 పరుగుల స్కోరు కూడా కష్టంగా ఉండే రోజులు పోయి, ఇప్పుడు 250 పరుగులు కూడా సునాయాసంగా ఛేదిస్తున్నారని, బౌలర్ల ఉనికిని ఈ నిబంధన దెబ్బతీస్తోందని రైనా ఆవేదన వ్యక్తం చేశారు.