ఎన్నికల పారదర్శకత కోసం రాజకీయ పార్టీలతో ఎంపీడీవో సమీక్ష
రిపోర్టర్: Srinivasarao Ummidisetti
స్థలం: కిర్లంపూడి
కాకినాడ జిల్లా కిర్లంపూడి మండలంలో జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నేపథ్యంలో గుర్తింపు పొందిన వివిధ రాజకీయ పార్టీల నేతలతో ఎంపీడీవో హరికృష్ణ ప్రత్యేకంగా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన కీలక అంశాలపై నేతలతో చర్చించారు. ఎన్నికలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా జరిగేలా అన్ని రాజకీయ పార్టీల నాయకులు అధికారులు సహకరించాలని ఎంపీడీవో హరికృష్ణ విజ్ఞప్తి చేశారు.