భారీ వర్షాలకు పలాసలో చెరువులను తలపిస్తున్న ప్రధాన రహదారులు

రిపోర్టర్: Dinesh Panda స్థలం: పలాస

శ్రీకాకుళం జిల్లా పలాసలో కురుస్తున్న భారీ వర్షాలకు కేటీ రోడ్డుపై వరద నీరు పొంగి ప్రవహిస్తోంది. నెహ్రూ పార్క్ వద్ద రోడ్డు జలమయమవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలువల ఆక్రమణల కారణంగానే మురికి నీరు నిలిచిపోతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.