ఆసియా క్రీడల్లో ఉజ్బెకిస్తాన్‌పై భారత్ ఘన విజయం
రిపోర్టర్: కిరణ్
స్థలం: India
జపాన్‌లోని కాకామిగహరా వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత మహిళల హాకీ జట్టు అద్భుత ప్రదర్శన కనబరిచింది. పూల్ బి ఆరంభ మ్యాచ్‌లో ఉజ్బెకిస్తాన్‌పై 19-0 గోల్స్ తేడాతో భారత్ ఘన విజయం సాధించింది. స్ట్రైకర్ దీపికా సెహ్రావత్ అరుదైన రికార్డు సృష్టిస్తూ ఏడు గోల్స్ చేయగా, మరోవైపు గోల్‌కీపర్ సవితా పునియా అత్యధిక మ్యాచ్‌లు ఆడిన క్రీడాకారిణిగా రికార్డు సమం చేశారు.