చెముడుగుంట పోలీస్ శిక్షణ కేంద్రంలో కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: నెల్లూరు

సర్వేపల్లి వెంకటాచలం మండలం చెముడుగుంటలోని జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రంలో కానిస్టేబుళ్ల పాసింగ్ అవుట్ పరేడ్ ఘనంగా నిర్వహించినట్లు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన 176 మంది నూతన కానిస్టేబుళ్ల కవాతును పరిశీలించి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో ప్రతిభ కనబరిచిన అభ్యర్థులకు జ్ఞాపికలు అందజేసి అభినందించారు. ప్రజలకు సేవ చేయడంలో పోలీసులు ఎప్పుడూ ముందుండాలని మంత్రి స్పష్టం చేశారు.