భారత వాయుసేన తదుపరి వైస్ చీఫ్‌గా ఎయిర్ మార్షల్ ఇందర్‌పాల్ సింగ్ వాలియా నియామకం
రిపోర్టర్: సతీష్
స్థలం: న్యూఢిల్లీ
భారత వాయుసేన తదుపరి వైస్ చీఫ్ ఆఫ్ ది ఎయిర్ స్టాఫ్‌గా ఎయిర్ మార్షల్ ఇందర్‌పాల్ సింగ్ వాలియా నియమితులయ్యారని రక్షణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది నవంబర్ మొదటి తేదీ నుంచి ఆయన ఈ నూతన బాధ్యతలను అధికారికంగా చేపట్టనున్నారు. ప్రస్తుత వైస్ చీఫ్ ఎయిర్ మార్షల్ అశుతోష్ దీక్షిత్ భారత వాయుసేన 29వ అధిపతిగా పదోన్నతి పొందనున్నట్లు రక్షణ వర్గాలు స్పష్టం చేశాయి.