ఆమనగల్లులో బీసీ వసతి గృహం: పనులు చురుకుగా సాగుతున్నాయి!
రిపోర్టర్: Abdul Azeem
స్థలం: ఆమనగల్
ఆమనగల్లు పట్టణంలోని ప్రధాన రహదారిపై నిర్మిస్తున్న బీసీ బాలుర వసతి గృహ భవన నిర్మాణ పనులను మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ గుర్రం కేశవులు శనివారం పరిశీలించారు. నాగర్ కర్నూల్ ఎంపీ మల్లురవి చొరవతో అరబిందో ఫార్మా రూ.4 కోట్లు సీఎస్ఆర్ నిధులు అందించింది.
గత ఏడాది శిథిలావస్థకు చేరిన భవనం స్థానంలో నూతన నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం రెండు స్లాబ్లు పూర్తయ్యాయి. పనులు చురుకుగా సాగుతున్నాయని గుర్రం కేశవులు తెలిపారు. ఎంపీ మల్లురవి, ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి శంకుస్థాపన చేశారు.