ప్రతి విద్యార్థి విజయం మన బాధ్యత.. తిరుపతి డీఈఓ కేవీఎన్ కుమార్ స్పష్టీకరణ!

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పుత్తూరు

పుత్తూరు జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న తెలుగు, గణితం శిక్షణా తరగతులను డీఈఓ కె.వి.ఎన్. కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులతో మాట్లాడుతూ.. ఎస్సెస్సీ 2027లో తిరుపతి జిల్లాను అత్యుత్తమ ఫలితాలు సాధించేలా తీర్చిదిద్దాలని పిలుపునిచ్చారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని, ఒక్క విద్యార్థి కూడా వెనుకబడకుండా నిరంతర ప్రాక్టీస్ అందించాలని ఆయన సూచించారు.