యువరాజ్ సింగ్ మంచంద మృతి కేసులో సాకేత్ కోర్టు కీలక ఆదేశాలు

రిపోర్టర్: సతీష్ స్థలం: New Delhi

యువరాజ్ సింగ్ మంచంద మృతి కేసులో దిల్లీలోని సాకేత్ కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. గుర్గావ్‌లోని బాద్‌షాపుర్‌లో లభ్యమైన అజ్ఞాత మృతదేహానికి సంబంధించిన పూర్తి పోలీసు, ఫోరెన్సిక్, వైద్య మరియు ఎలక్ట్రానిక్ రికార్డులను భద్రపరిచి కోర్టు ముందుంచాలని గుర్గావ్ పోలీసు కమిషనర్‌ను కోర్టు ఆదేశించింది. మృతుడి సోదరి దాఖలు చేసిన దరఖాస్తును విచారించిన న్యాయస్థానం ఈ రికార్డులను సెప్టెంబర్ 22, 2026 నాటికి సమర్పించాలని స్పష్టం చేసింది.