దారుణం: భార్యను హత్య చేసి డ్రైనేజీలో పడేసిన భర్త అరెస్ట్
రిపోర్టర్: సతీష్
స్థలం: Bengaluru
బెంగళూరులో వివాహేతర సంబంధం అనుమానంతో ఇరవై ఐదు సంవత్సరాల వ్రాక్సానా అనే మహిళను ఆమె భర్త మొహమ్మద్ ఇర్ఫాజ్ రాళ్ళతో కొట్టి దారుణంగా హత్య చేసినట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. అనంతరం మృతదేహాన్ని ప్లాస్టిక్ కవర్లో చుట్టి గోపాలపుర డ్రైనేజీలో పడేసి పరారైనట్లు తెలిపారు. స్థానికుల సమాచారం మేరకు దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు గురువారం స్పష్టం చేశారు.