రైతన్నలకు కీలక సూచన: యాసంగి పంటల సాగుకు దూరంగా ఉండాలన్న సుదర్శన్రెడ్డి

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Nizamabad

రాష్ట్రంలో ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు తగ్గడంతో రైతులు యాసంగి పంటల సాగుకు దూరంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సుదర్శన్రెడ్డి విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, నీటి లభ్యతను దృష్టిలో ఉంచుకుని సాగుపై నిర్ణయం తీసుకోవాలని, రాబోయే రోజుల్లో తాగునీటికే అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు స్పష్టం చేశారు. నీటి వృథాను అరికట్టాలని అధికారులను ఆదేశించారు.