కాంగ్రెస్ పాలనా వైఫల్యంతో రైతులు కన్నీరు పెడుతున్నారంటూ కేసీఆర్ ఆవేదన
రిపోర్టర్: హరి
స్థలం: Telangana
కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాల వల్ల తెలంగాణలోని పల్లెల్లో రైతులు తీవ్ర కన్నీళ్ల గోస పడుతున్నారని బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు ఆరోపించారు. గోదావరి జలాలు వృథాగా దిగువకుపోతున్నా పట్టించుకోని ప్రభుత్వం రాష్ట్రానికి శాపంగా మారిందని ఆయన విమర్శించారు. పంటలను కాపాడుకునేందుకు సిర్సపల్లిలో రైతులు బోర్లు, బావులు తవ్వేందుకు మూడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని పేర్కొన్నారు. సాగునీరు అందక అన్నదాతలు పడుతున్న పాట్లు కాంగ్రెస్ పాలనా వైఫల్యానికి నిదర్శనమని కె. చంద్రశేఖర్ రావు తీవ్రంగా మండిపడ్డారు.