పేదోడి చూపునకు భరోసానిచ్చిన ఉచిత కంటి వైద్య శిబిరం

రిపోర్టర్: Alfa News Desk స్థలం: కడ్తాల్

రంగారెడ్డి జిల్లా కడ్తాల్లోని ఎంబీఏ గార్డెన్స్లో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆరో మెగా ఉచిత కంటి వైద్య శిబిరానికి ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. శంకర నేత్రాలయ వైద్యుల ఆధ్వర్యంలో ఆరు రోజులుగా కొనసాగిన ఈ శిబిరంలో వేలాది మందికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు పంపిణీ చేశారు. ఈ సేవా కార్యక్రమం ద్వారా ఎంతోమంది గ్రామీణ పేద ప్రజలకు దూర ప్రాంతాలకు వెళ్లే ఇబ్బంది తప్పిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.