లక్సెట్టిపేటలో ఘనంగా కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: లక్సెట్టిపేట

లక్సెట్టిపేట పట్టణంలోని పాత బస్టాండ్ సర్కిల్ వద్ద బీసీ సంఘాలు మరియు పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో కొండా లక్ష్మణ్ బాపూజీ 111వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. పట్టణంలో బాపూజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపాలిటీ కార్యాలయంలోనూ చైర్ పర్సన్ దొంత అంజలి నర్సయ్య ఆధ్వర్యంలో ఈ వేడుకలను నిర్వహించారు.