భారీ షాక్: త్వరలో పెరగనున్న నిత్యావసర సరుకులు మరియు మొబైల్ రీఛార్జ్ ధరలు

రిపోర్టర్: అశోక్ స్థలం: న్యూఢిల్లీ

సామాన్య ప్రజలపై మరో ఆర్థిక భారం పడనుందని, త్వరలో సబ్బులు, వంటనూనెలు, టూత్పేస్ట్లతో పాటు మొబైల్ రీఛార్జ్ ఛార్జీలు కూడా పెరగనున్నాయని ఆర్థిక నిపుణులు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలు పెరగడం, ముడిసరుకుల వ్యయం భారీగా ఎగబాకడంతో ఎఫ్ఎంసీజీ కంపెనీలు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు సమాచారం. నిత్యావసరాల ధరల పెరుగుదల మధ్యతరగతి, పేద ప్రజల కుటుంబ బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపనుందని విశ్లేషకులు స్పష్టం చేశారు.