పుత్తూరులో వైసీపీని వీడి తెలుగుదేశంలో చేరిన 20 కుటుంబాలు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: పుత్తూరు
పుత్తూరు మండలం పరమేశ్వరమంగళం పంచాయతీలోని దళిత వాడ, కూర్మాను కండ్రిగకు చెందిన 20 కుటుంబాలు వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరాయి. మాజీ ఉపసర్పంచ్ రంజిత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికలో, నగరి ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ వారికి పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. నియోజకవర్గ అభివృద్ధికి ఎమ్మెల్యే చేస్తున్న కృషికి ఆకర్షితులై పార్టీలో చేరినట్లు వారు తెలిపారు.