చెన్నైలో భారీ సైబర్ మోసం గుట్టు రట్టు, పది మంది అరెస్ట్

రిపోర్టర్: కృష్ణ స్థలం: తమిళనాడు

చెన్నై నగరంలో రూ.24.54 కోట్ల భారీ సైబర్ ఆర్థిక మోసాలకు పాల్పడిన పది మంది అంతరాష్ట్ర నిందితులను ప్రత్యేక పోలీసు బృందాలు అరెస్ట్ చేశాయి. తమిళనాడు, కేరళ, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాలలో ఈ దాడులు నిర్వహించారు. నిందితుల నుంచి రూ.42.72 లక్షల నగదుతో పాటు మొబైల్ ఫోన్లు, సిమ్ కార్డులు స్వాధీనం చేసుకున్నారు. సైబర్ నేరాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.