మౌలిక వసతులు కరువై నరకయాతన అనుభవిస్తున్న అలంపూర్ వార్డు ప్రజలు

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: అలంపూర్

అలంపూర్ పట్టణంలోని ఎనిమిదవ వార్డులో సీసీ రోడ్లు లేక స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సుమారు పదిహేనేళ్ల క్రితం వేసిన రోడ్లు చాలావరకు కాలనీలలో పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పలుచోట్ల మట్టి రోడ్లే దర్శనమిస్తుండటంతో వర్షాకాలంలో ప్రజలు మరింత దయనీయమైన పరిస్థితిని ఎదుర్కొనాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు స్పందించి వెంటనే సీసీ రోడ్ల నిర్మాణానికి తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు తీవ్రంగా కోరుతున్నారు.