పుస్తకం మార్చిన జీవితం: లింగ వివక్షపై ఎదురుతిరిగిన జార్ఖండ్ బాలిక తన్ను కుమారి

రిపోర్టర్: మహేష్ స్థలం: జార్ఖండ్

జార్ఖండ్కు చెందిన పదిహేడేళ్ల తన్ను కుమారి అనే బాలిక ఓ కామిక్ పుస్తకం చదివి తన జీవితాన్ని మార్చుకుంది. కుటుంబంలో ఆడపిల్లలపై జరుగుతున్న లింగ వివక్షను గుర్తించి కుటుంబ సభ్యులను ఎదిరించింది. తమ్ముడితో సమానంగా చదువుకునే హక్కు కోసం పోరాడింది. అన్యాయాలను ప్రశ్నిస్తూ తోటి అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తున్నట్లు ఉపాధ్యాయులు తెలిపారు.