రుద్రంకోటలో అంగన్వాడీ కేంద్రం ఆధ్వర్యంలో ఘనంగా ఉత్సవ వేడుక

రిపోర్టర్: Alfa News Desk స్థలం: వేలేరుపాడు

వేలేరుపాడు మండలంలోని రుద్రంకోట గ్రామంలో అంగన్వాడీ కేంద్రం నందు శనివారం అంగన్వాడీ ఉత్సవం ఘనంగా నిర్వహించారు. మహిళా మోర్చా నాయకురాలు సారె నాగమణి ముఖ్య అతిథిగా హాజరై గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పోషకాహారం అందించడంలో అంగన్వాడీల పాత్రను కొనియాడారు. బాలసంజీవిని కిట్లు, పౌష్టికాహార పదార్థాల వినియోగంపై విస్తృత అవగాహన కల్పించారు.