పారిస్ ఒలింపిక్స్‌లో గర్భిణిగా అద్భుతం సృష్టించిన ఆర్చర్ యైలాగుల్
రిపోర్టర్: రమేష్
స్థలం: World
పారిస్ ఒలింపిక్స్‌లో అజర్బైజాన్ ఆర్చర్ యైలాగుల్ రమజానోవా ఆరున్నర నెలల గర్భవతిగా బరిలోకి దిగి సంచలనం సృష్టించారు. కీలకమైన టైబ్రేకర్ సమయంలో తన బిడ్డ కదలికను అనుభూతి చెందానని, ఆ స్ఫూర్తితోనే పర్ఫెక్ట్ 10 స్కోరు సాధించి తదుపరి రౌండ్‌కు దూసుకెళ్లానని ఆమె తెలిపారు. గర్భం తనకు అడ్డంకి కాదని, బిడ్డతో కలిసి పోరాడుతున్నట్లు భావించానని ఆమె చెప్పిన మాటలు క్రీడా ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి.