ఉద్యోగం కోసం రూ.30 వేల నగదు రివార్డ్ ప్రకటించిన టెక్కీ

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

ఐటీ లేదా ఎలక్ట్రానిక్స్ రంగంలో ఉద్యోగం ఇప్పించిన వారికి ముప్పై వేల రూపాయల నగదు రివార్డు ఇస్తానని ఓ యువకుడు ప్రకటించినట్లు సోషల్ మీడియాలో పోస్టు వైరల్ అయింది. ఉద్యోగాలు రాక తీవ్రంగా నిరాశ చెందానని, ఎన్నో దరఖాస్తులు చేసినా స్పందన రాలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు పలువురు నెటిజన్లు తెలిపారు. ఈ వినూత్న ప్రకటన ప్రస్తుతం ఆన్లైన్ వేదికగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.