కాంగ్రెస్ విఫల పాలనపై బిఆర్ఎస్ నిరసన.. రాస్తారోకోతో ట్రాఫిక్ స్తంభన
రిపోర్టర్: BHANUCHANDER DOMMATI
స్థలం: వర్ధన్నపేట
వరంగల్-ఖమ్మం జాతీయ రహదారిపై బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు తుల్లా కుమారస్వామి ఆధ్వర్యంలో భారీ ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ప్రజలు, రైతులు, విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని నాయకులు మండిపడ్డారు.
రైతులకు సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని, విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయలేదని ఆరోపించారు. ప్రజా పాలన పేరుతో పేదలను మోసం చేస్తున్నారని, హామీలు నెరవేర్చకపోతే ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని వారు ప్రభుత్వాన్ని హెచ్చరించారు.