నాయుడుపేటలో దేశంలోనే అతిపెద్ద సోలార్ ప్లాంట్ ప్రారంభం

రిపోర్టర్: నరేష్ స్థలం: Naidupeta, Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్ లోని నాయుడుపేటలో ప్రీమియర్ ఎనర్జీస్ సంస్థ దేశంలోనే అతిపెద్ద సోలార్ సెల్ తయారీ యూనిట్ ను ప్రారంభించింది. రూ.3,293 కోట్ల భారీ పెట్టుబడితో 7 గిగావాట్ల సామర్థ్యంతో అధునాతన ఎన్ టైప్ టాప్కాన్ ప్లాంట్ ను ఏర్పాటు చేశారు. దీనితో కంపెనీ మొత్తం సోలార్ సెల్ ఉత్పత్తి సామర్థ్యం 10.6 గిగావాట్లకు చేరుకుంది. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో దోహదపడనుంది.